T20 World Cup : ఈసారి టీ20 వరల్డ్కప్ కాస్త కొత్తగా.. బరిలోకి 20 జట్లు
X
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు రంగం సిద్దం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయక్త వేదికలపై పొట్టి వరల్డ్ కప్ జరగనుంది. కాగా ఈసారి ఫార్మట్ కాస్త కొత్తగా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు డైరెక్ట్ క్వాలిఫై కాగా.. మెరుగైన ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అవకాశం దక్కించుకున్నాయి. అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కెనడా, ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి నేపాల్, ఒమన్.. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల క్వాలిఫయింగ్ నుంచి పాపువా న్యూ గినియా, యూరప్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్, ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా దేశాలు టోర్నీకి అర్హత సాధించాయి. ఈసారి టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. కాగా మొదట జూన్ 4 నుంచి 30 వరకు టోర్నీ ఉంటుందని ఐసీసీ ప్రకటించగా.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పు చేసింది. ఒకరోజు ముందుగానే అంటే.. జూన్ 3వ తేదీనే టోర్నీ ప్రారంభమై.. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. కాగా ఈ టోర్నీని సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది.
టోర్నీ ఫార్మాట్ వివరాలు...
• ఈసారి టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 4 గ్రూపులుగా విభజిస్తారు.
• ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి.
• ఈ నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
• సూపర్ 8కు చేరుకున్న జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
• సూపర్-8 దశలో ఒక్కో గ్రూపులో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.
• ఇలా సెమీఫైనల్స్ కు చేరే నాలుగు జట్ల నుంచి రెండు టీమ్ లు ఫైనల్ లో అడుగుపెడతాయి.
T20 World Cup 2024 will kick off from 3rd June.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 29, 2023
The Final will be played on 30th June...!!! pic.twitter.com/tiv6gt7n8p