Home > క్రీడలు > టీ20 వరల్డ్క‌ప్ కొత్త లోగో విడుద‌ల‌.. స్పెష‌ల్ ఏంటంటే..?

టీ20 వరల్డ్క‌ప్ కొత్త లోగో విడుద‌ల‌.. స్పెష‌ల్ ఏంటంటే..?

టీ20 వరల్డ్క‌ప్ కొత్త లోగో విడుద‌ల‌.. స్పెష‌ల్ ఏంటంటే..?
X

మరో మెగా టోర్నీకి రంగం సిద్దమైంది. పొట్టి క్రికెట్ కు అన్ని దేశాలు ప్రిపేర్ అవుతున్నాయి. 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం కొత్తగా, రీఫ్రెష్ గా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి. 2024 జూన్‌లో పురుషుల టీ20 వరల్డ్ కప్‌ జరగనుండగా.. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ కప్‌కు సంబంధించి ఐసీసీ కొత్త లోగోలను ఆవిష్కరించింది. ఐసీసీ మార్కెటింగ్‌ అండ్ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైయిర్‌ ఫర్లాంగ్ దీనిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన క్లైయిర్‌ ఫర్లాంగ్ ‘అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఆవిష్కరించిన లోగోలు పొట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని తెలిపాడు. పోయిన వరల్డ్ కప్ ను జాస్ బట్లర్ నాయకత్వంతో ఇంగ్లండ్ జట్టు ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే.


Updated : 7 Dec 2023 9:36 PM IST
Tags:    
Next Story
Share it
Top