Home > క్రీడలు > ICC World cup 2023: ఇప్పటివరకు బద్దలైన రికార్డులివే

ICC World cup 2023: ఇప్పటివరకు బద్దలైన రికార్డులివే

ICC World cup 2023: ఇప్పటివరకు బద్దలైన రికార్డులివే
X

భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ పొరు రసవత్తరంగా సాగుతుంది. మొదటి మ్యాచ్ లోనే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు షాక్ తగలగా.. ఐదుసార్ల వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతుంటే.. మరికొన్ని మ్యాచ్ లు వన్ సైడ్ అయిపోతున్నాయి. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. రెండిట్లోనూ గెలుపొందింది. కాగా ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో 12 మ్యాచ్ లు జరగగా.. ప్రతీ మ్యాచ్ లో ఓ వరల్డ్ రికార్డ్ బ్రేక్ అవుతూనే ఉంది.

రోహిత్ శర్మ రికార్డ్:

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. సెంచరీతో అదరగొట్టాడు. దీంతో వరల్డ్ కప్ లో ఎక్కువ సెంచరీలు (19 ఇన్నింగ్స్ లో 7 సెంచరీలు) చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అంతేకాదు అన్ని ఫార్మట్ లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 453 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 556 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డ్ క్రిస్ గేల్ (553 సిక్సర్లు) పేరిట ఉంది.

మిచెల్ స్టార్క్ రికార్డ్:

వన్డే వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ గా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డ్ కెక్కాడు. 2015లో 22 వికెట్లు, 2019లో 27 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ పేరుపై ఉండేది. మలింగ 25 ఇన్నింగ్స్ లో 50 వికెట్లు తీసుకోగా.. ముత్తయ్య మురళీధరన్, మెక్ గ్రాత్ 30 ఇన్నింగ్స్ లో ఈ మార్క్ అందుకున్నారు.

ఐడెన్ మార్క్రమ్ రికార్డ్:

వన్డేల్లో, వన్డే వరల్డ్ కప్ లో వేగవంతంగా సెంచరీ చేసిన ప్లేయర్ గా ఐడెన్ మార్క్రమ్ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన మార్క్రమ్.. 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పటివరకు ఆ రికార్డ్ కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది.

సౌతాఫ్రికా రికార్డ్:

వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు (టీం టోటల్) చేసిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. శ్రీలంకపై 428/5 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆ రికార్డ్ ఆసీస్ పై ఉండేది. 2015లో ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ పై నమోదుచేసింది.

పాకిస్తాన్ రికార్డ్:

అత్యధిక పరుగులు చేజ్ చేసిన జట్టుగా పాక్ రికార్డ్ సృష్టించింది. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేదించింది. ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఐర్లాండ్ పై ఉండేది. 2011లో ఐర్లాండ్ ఇంగ్లాండ్ పై 329 పరుగులు చేదించింది.


Updated : 13 Oct 2023 12:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top