శ్రీలంకను సస్పెండ్ చేసిన ఐసీసీ.. ఎందుకంటే..?
Krishna | 10 Nov 2023 9:40 PM IST
X
X
శ్రీలంక విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి శ్రీలంకను సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. బోర్డు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని.. అందుకే తాత్కాలికంగా సస్పెండ్ విధించామని స్పష్టం చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. దీనికి సంబంధించిన రూల్స్ త్వరలో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వివరించింది.
వచ్చే జనవరిలో శ్రీలంకలో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జరగనుంది. తాజాగా లంక బోర్డుపై సస్పెన్షన్ విధించడంతో ఈ టోర్నీ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక వన్డే ప్రపంచకప్లో లంక దారుణంగా ఫెయిల్ అయ్యింది. 9 మ్యాచులు ఆడిన ఆ టీం కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.
Updated : 10 Nov 2023 9:40 PM IST
Tags: srilanka srilanka team srilanka cricket board srilanka cricket icc icc suspends srilanka srilanka govt cricket cricket news cricket updates odi world cup world cup 2023 cwc 2023
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire