ఐసీసీ ర్యాంకింగ్స్..టాప్‌లో అశ్విన్, జడేజా
X
టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ఐసీస్ ప్రకటించింది. భారత్ ఆటగాడు రహానె పైకి దూసుకొచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా ఓడినప్పటికీ..రహానె రాణించడంతో తన ర్యాంక్ ను మెరుగుపర్చుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 37వ స్థానంలో రహానె కొనసాగుతున్నాడు. రహానెతో పాటు WTC ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ ఆరు స్థానాలను మెరుగుపరుచుకుని 94వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్‌కు దిగజారిపోయారు. భారత్ తరఫున గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ ఒక్కడే టాప్ -10 కొనసాగుతున్నాడు. ఇక మొదటి మూడు స్థానాలు ఆసీస్ బ్యాటర్లవే కావడం విశేషం. లబుషేన్ (903 పాయింట్లు), స్టీవ్ స్మిత్ (885 పాయింట్లు), ట్రావిస్ హెడ్ (884 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
టాప్‌లో అశ్విన్
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోయినా తన మొదటి స్థానాన్నిఅశ్విన్ నిలబెట్టుకున్నాడు. తర్వాతి స్థానాల్లో జేమ్స్ అండర్సన్ (850), పాట్ కమిన్స్ (829) నిలిచారు. బుమ్రా 8, రవీంద్ర జడేజా 9వ స్థానాల్లో ఉన్నారు. ఇక ఆలౌరౌండర్ విభాగంలో జడేజా నెం.1 స్థానాంలో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్‌కు 4వ స్థానం లభించింది.