క్రికెట్లో కొత్త రూల్.. స్టాప్ క్లాక్తో కెప్టెన్లకు కష్టమే..
X
వన్డే, టీ20 క్రికెట్లో కొత్త రూల్ రానుంది. టైం వేస్ట్ కాకుండా క్రికెట్ను మరింత వేగవంతం చేసేందుకు ఐసీసీ కొత్త రూల్ను తీసుకొచ్చింది. డిసెంబర్ 12 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తోంది. విండీస్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ నుంచే స్టాప్ క్లాక్ అనే నిబంధనను అమల్లోకి తీసుకరావాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ రూల్ ప్రకారం ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. ఓవర్ ముగిసిన తర్వాత బౌలింగ్ కెప్టెన్ 60 సెకన్లలోపే మరో బౌలర్ను దించాల్సి ఉంటుంది.
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్‌లో నిర్వహించిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధనకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ ఓవర్ - ఓవర్‌కు మధ్య 60సెకన్లు మించితే.. రెండుసార్లు వార్నింగ్‌తో వదిలేస్తారు. కానీ మూడోసారి మాత్రం పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ టీమ్‌కు 5 పరుగులు జమచేస్తారు. ఈ నిబంధన వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఏప్రిల్ తర్వాత ఈ రూల్ అమలుపై సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనుంది. క్రికెట్‌లో అనవసర సమయాన్ని అరికట్టేందుకే ఈ నిబంధన తీసుకొస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.