Home > క్రీడలు > టెస్టు ర్యాంక్స్ అప్డేట్ చేసిన ఐసీసీ.. టాప్ 10లోకి రోహిత్..

టెస్టు ర్యాంక్స్ అప్డేట్ చేసిన ఐసీసీ.. టాప్ 10లోకి రోహిత్..

ఆటగాళ్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ అప్‌డేట్ చేసింది. కేప్‌టౌన్ టెస్టులో సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకులు మెరుగుపడ్డాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్ల స్థానాలు మెరుగయ్యాయి. ఎక్కువగా టీమిండియా, సౌతాఫ్రికా ఆటగాళ్ల ర్యాంకింగ్సే మెరుగుపడడం గమనార్హం. సౌతాఫ్రికాపై రాణించిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. 6వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. గతంలో 14వ ర్యాంకులో ఉన్న రోహిత్.. ప్రస్తుతం 10వ ర్యాంక్ సాధించాడు.

బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ 13 స్థానాలు ఎగబాకి.. 17వ స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 6/15తో సిరాజ్ రాణించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 4వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ అశ్విన్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్లో కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, డారిల్ మిచెల్ టాప్ 5 బ్యాట్స్మెన్లుగా నిలిచారు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ రెండు స్థానాలు దిగజారి 8వ స్థానానికి పడిపోయాడు. అయితే మరో పాక్ బ్యాటర్ రిజ్వాన్ 10 స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని చేరుకున్నాడు.

Updated : 10 Jan 2024 9:14 AM IST
Tags:    
Next Story
Share it
Top