IND vs BAN: టీమిండియాకు షాక్.. మ్యాచ్ మధ్యలో హార్దిక్కు గాయం.. నొప్పితో..
X
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బౌలింగ్ చేస్తున్న క్రమంలో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. మైదానాన్ని విడాడు. బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా.. తన తొలి ఓవర్ లో మూడో బంతికి గాయపడ్డాడు. బంగ్లా ఓపెనర్ల లిట్టన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. దాన్ని హార్దిక్ కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. దాంతో బాల్ హార్దిక్ కాలి మడమకు బలంగా తాకింది. దీంతో హార్దిక్ నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి హార్దిక్ ను పరీక్షించి.. డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లాడు. దాంతో మిగిలిన మూడు బాల్స్ ను విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి ఓవర్ పూర్తిచేశాడు. హార్దిక్ గాయం.. టీమిండియా జట్టుతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పాండ్యా గాయం తీవ్రమైందా..లేక నార్మల్ దా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో అతను వరల్డ్ కప్ కు దూరం అయితే టీం పరిస్థితి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యా త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.