అలా అయితేనే టీమ్ లోకి వస్తాను-హార్దిక్ పాండ్యా
X
హార్దిక్ పాండ్యా....పేస్ ఆల్ రౌండర్ గా ఎదిగిన ఇతను గాయాల కారణంగా టీమ్ ఇండియాలో ఉండలేకపోయాడు. ఐపీఎల్ లో బాగానే ఆడుతున్నా నాలుగు ఓవర్ల కోటాను కూడా వేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. బ్యాటింగ్ లో మాత్రం కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ ల్లోకి హార్దిక్ పాండ్యా ఎంటర్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లో 3 ఓవర్లు వేసిన 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. టీమ్ ఇండియాకు హార్దిక్ రావడం కొత్త బలమనే చెప్పాలి.
వెస్టిండీస్ తో మ్యాచ్ అయ్యాక హార్దిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. గాయాలు మళ్ళీ తిరగబెట్టడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను, వ్యాయామాలు చేస్తూ తిరిగి ఆటలోకి రావడానికి సన్నద్ధమవ్వాలని అనుకున్నా. అప్పుడు నా సహచరులకు ఒక్కటే చెప్పా...తిరిగి తాను జట్టులోకి వస్తే మాత్రం ఆల్ రౌండర్ గానే వస్తానని తెగేసి చెప్పాను. నేను విశ్రాంతిలో ఉన్నప్పుడు నాకు ఛాలెంజింగ్ టైమ్. అప్పుడు ఆటలోకి రాకుండా ఉండడమే మంచిదనిపించింది. నావల్ల మరొక ఆటగాడు ఇడకుండా పోతాడు. నేనూ ఆడలేను అంటూ చెప్పుకొచ్చాడు.విండీస్ తో మొదటి మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. కానీ బ్యాటింగ్ లో మాత్రం అతడిని దురదృష్టం వెంటాడింది. రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది.