IND vs AFG: ఇవాళ గెలిస్తే.. సరికొత్త చరిత్రే.. క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
X
టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు ఆడుతున్నతున్న ఏకైక సిరీస్ లో టీమిండియా అదరగొడుతుంది. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఇవాళ బెంగళూరులో జరిగే చివరి టీ20లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ విజయంలో టీ20 ఫార్మట్ లో చరిత్ర లిఖించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ ఆఫ్ఘాన్ పై గెలిస్తే.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వైట్ వాష్లు (సిరీస్ లో అన్ని మ్యాచుల్లో విజయాలు) చేసిన జట్టుగా భారత్ నిలుస్తుంది. ఇప్పవరకు ద్వైపాక్షిక టీ20 సిరీసుల్లో అత్యధిక వైట్ వాష్లు (8) చేసిన జట్లుగా.. భారత్, పాకిస్తాన్ ఉన్నాయి.
ఇవాళ ఆఫ్ఘాన్ ను ఓడిస్తే.. మొత్త 9 క్లీన్ స్వీప్ లతో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా అవతరిస్తుంది. ఇకపోతే.. ఈ సిరీస్ లో అన్ని విభాగాల్లో ఆఫ్ఘాన్ పై ఆధిపత్యం చలాయించిన భారత్.. 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు మూడో టీ20లో కూడా సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచుల్లో తేలిపోయిన ఆఫ్ఘనిస్తాన్.. చివరి మ్యాచ్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.