Pakistan captain : కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదు
X
టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 2021లో తప్పుకున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీ20 కెప్టెన్సీపై ప్రకటన చేశాడు.అప్పట్లో ఈ అంశం పెద్ద వివాదాన్ని రాజేసింది. తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకోవాల్సి వచ్చింది. కోహ్లీ స్థానంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది. అనంతరం కొన్ని రోజులకు టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకున్నాడు. దీంతో టెస్టు టీం పగ్గాలు కూడా రోహిత్ శర్మకే దక్కాయి. నాయకత్వ పగ్గాలు మారడంతో, అనుభవజ్ఞుడైన రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
కొత్త కోచ్, కెప్టెన్ వచ్చిన తర్వాత భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. గత సంవత్సరం T20 ప్రపంచ కప్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయింది. దీనిపై తర్వాత టీమిండియా ముందు అతి పెద్ద సవాల్ వన్డే వరల్డ్ కప్. స్వదేశంలో 2023 వరల్డ్‌కప్ జరుగుతుండడంతో భారత్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వచ్చే ఆసియా కప్‌త, వరల్డ్ కప్ ముందు భారత్ ఆత్మవిశ్వాసంగా లేదు. రెండు నెల్లలో ప్రపంచకప్ వస్తున్న తుది జట్టుపై అయోమయం నెలకొంది. కీలక ఆటగాళ్లు గాయాలు బారిన పడడం ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా భారత్ పరిస్థితిపై మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ రషీద్ లతీఫ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, లతీఫ్ అన్నాడు.
ఇప్పటికీ కెప్టెన్‌గా ఉంటే ప్రపంచ కప్ కోసం భారత్ 100 శాతం సిద్ధంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉందని, దీంతో గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌పై అంచనాలు పెరుగుతాయని చెప్పాడు. భారత్ టీం ప్రయోగాలపై కూడా లతీఫ్ విమర్శించాడు. 4 నుంచి 7వ నెంబర్ వరకు ఒక్క ప్లేయర్‌ను కుదురుకోనివ్వకుండా రకరకాల మార్పులు సృష్టించారని తెలిపాడు. దీంతో ప్లేయర్స్ జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు' అని లతీఫ్ తన య్యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించాడు.