స్క్రిప్టులు చదివి అలా మాట్లాడుతున్నాడు.. నా భార్య చాలా మంచిది: రవీంద్ర జడేజా
X
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన బౌలింగ్, ఫీల్డింగ్ తో జట్టుకు వెన్నుముకలా నిలబడతాడు. జట్టుకు అతను అందించిన విజయాలు అనేకం. క్రికెటర్ గా ఎంత కూల్ గా ఉంటాడో.. వ్యక్తిగతంగా అంతే హుందాగా ఉంటాడు. అనవర విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలబడలేదు. జడేజా భార్య రివాబా జడేజా కూడా అంతే. ఒక ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా.. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. ఈ క్రమంలో రవింద్ర జడేడా తండ్రి అనిరుధ్ సింగ్.. ఈ జంటపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రివాబా వల్ల కుటుంబంలో చీలికలు వచ్చాయని మీడియా ముఖంగా చెప్పడంతో.. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రివాబాతో పెళ్లి జరిగినప్పటి నుంచి.. తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని, ఫ్యామిలీలో చీలికలు రావడానికి రివాబా కారణమని ఆరోపించాడు. ఒకే ఊరిలో ఉంటున్నా.. కొడుకు ముఖం చూసే భాగ్యం దక్కట్లేదని చెప్పారు. జడేజా అతని భార్య రివాబాతో మాకు, మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మేం వారికి ఇంటికి పిలవము, వాళ్లు మాకు ఫోన్ చేసి యోగక్షేమాలు పట్టించుకోరు. జడేజా పెళ్లైన రెండుమూడు నెలల తర్వాత ఈ సమస్యలు మొదలయ్యాయని అనిరుధ్ సంచలన ఆరోపణలు చేశాడు. వీటిపై స్పందించిన జడేజా.. తండ్రి ఆరోపణల్లో వాస్తవం లేదని తిప్పికొట్టాడు.
తన భార్య రివాబాపై తండ్రి చేసిన వ్యాఖ్యలను.. రవీంద్ర జడేజా ఖండించాడు. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేశాడు. టీవీ చానల్స్, ఇంటర్వ్యూ స్క్రిప్ట్ ల ద్వారా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. బీజెపీ అభ్యర్థిగా జామ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య రివాబా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తన తండ్రి కావాలనే తప్పుడు మాటలు మాట్లాడడని, ఆయన చెప్పిన ఏ విషయంలో వాస్తవాలు లేవని స్పష్టం చేశాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నా.. బహిరంగంగా వాటి గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని జడేజా స్పష్టం చేశాడు.