Home > క్రీడలు > History of Cricket : క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఆ ముగ్గురే...అందులోనూ ఇద్దరు మనవాళ్లే

History of Cricket : క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఆ ముగ్గురే...అందులోనూ ఇద్దరు మనవాళ్లే

History of Cricket : క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఆ ముగ్గురే...అందులోనూ ఇద్దరు మనవాళ్లే
X

తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తనదైన శైలిలో సత్తా చాటి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇండియా నుంచి ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే బుమ్రా కాకుండా గతంలో ఇటువంటి గౌరవాన్ని ఇద్దరు క్రికెటర్స్ మాత్రమే దక్కించుకున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించడం కోసం క్రికెటర్ల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కనీసం ఒక్క సారైనా నంబర్‌ వన్‌గా నిలిచింది మాత్రం ముగ్గురే. అందులో ఇద్దరు ఇండియా క్రికెటర్లే కావడం మరో విశేషం.

మందుగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) ఈ ఘనతను సాధించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో రికీ పాటింగ్ ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2005లో వన్డే, టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును సాధించాడు. ఆ తర్వాత టీ20ల్లోనూ టేబుల్ టాపర్‌గా నిలిచాడు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఈ ర్యాంక్‌ అందుకొన్న మొదటి ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సృష్టించాడు.

కింగ్ కోహ్లీ..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. రికార్డులను బద్దలు కొట్టడంలో కోహ్లీ స్టైలే వేరు. మూడు ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన మొదటి భారత క్రికెటర్ గా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు. ముందుగా 2013లో అతడు వన్డేల్లో నంబర్‌ వన్‌గా నిలిచినప్పటికీ తొందరగానే ఆ స్థానాన్ని కోల్పోయాడు. 2014లో టీ20ల్లో టాప్‌ ర్యాంక్‌ అందుకొన్నాడు. మళ్లీ తిరిగి 2017లో ఆస్థానాన్ని దక్కించుకుని.. దాదాపు నాలుగున్నరేండ్ల పాటు కొనసాగి రికార్డు నెలకొల్పాడు. 2018లో టెస్టుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించాడు రన్ మిషన్ కోహ్లీ.

క్రికెట్‌ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ ర్యాంకును సాధించిన తొలి బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా (jasprit Bumrah) రికార్డు నెలకొల్పాడు. ముందుగా 2017లో తొలిసారిగా టీ20ల్లో బుమ్రా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తర్వాత 2018లో వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరి..2022 వరకు కొనసాగాడు. తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానం సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు మనవాళ్లే కావడం విశేషం.

Updated : 8 Feb 2024 12:01 PM IST
Tags:    
Next Story
Share it
Top