హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు
Kiran | 25 Nov 2023 9:33 AM IST
X
X
రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో అధికారులు వరస సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని వ్యాపారులే లక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేపట్టింది. హోటల్ కింగ్స్ ప్యాలెస్ ఓనర్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కోహినూర్, కింగ్స్ గ్రూప్ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్న వీరంతా ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో కూడా కోహినూర్ గ్రూప్ ఎండీ ఇండ్లు, ఆఫీసులతో పాటు హోటళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. ఓల్డ్‌సిటీ, దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్‌కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.
Updated : 25 Nov 2023 9:33 AM IST
Tags: telangana news telugu news assembly election 2023 telangana election 2023 hyderabad old city it raids income tax department it raids in hyderabad kohinoor group hotel kings palace political party it officials
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire