IND vs AFG: ఆఫ్ఘాన్ను కట్టడి చేసిన టీమిండియా.. టార్గెన్ కాస్త తక్కువే..!
X
టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్ నుంచే ఆతిపథ్యం ప్రదర్శించిన భారత బౌలర్లు.. ఆఫ్ఘన్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆఫ్ఘనిస్తాన్ 158 పరుగులు చేసింది. కాస్త నెమ్మదిగా ఆరంభించిన ఆఫ్ఘన్ ఓపెనర్లు తర్వాత పుంజుకున్నారు. రహ్మానుల్లా గుర్బాజ్ (23, 28 బంతుల్లో), ఇబ్రహీం (25, 22 బంతుల్లో) పరవాలేదనిపించారు.
కానీ అక్షర్ పటేల్, దూబె వారిని వెంట వెంటనే పెవిలియన్ చేర్చారు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా (29, 22 బంతుల్లో), మహమ్మద్ నబీ (42, 27 బంతుల్లో) దాటిగా ఆడి స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లారు. చివర్లో నజీబుల్లా (19, 11 బంతుల్లో) మెరిశాడు. రహ్మత్ షా (3) నిరాశ పరిచాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మొదటి ఓవర్ మెయిడిన్ చేశాడు. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబె ఒక వికెట్ తీసుకున్నాడు.