IND vs AFG: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా .. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20
X
IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే. తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టీ20 గెలుపుతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. నేడు ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడిన భారత జట్టు అన్నింటిలోనూ విజయం సాధించింది. కేవలం 1 టీ20, 1 టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించాలని భావిస్తోంది. అయితే, అఫ్గాన్‌ను ఏమాత్రం ఈజీగా తీసుకోవడానికి లేదు. సిరీస్ సమం కోసం ఆ జట్టు గట్టిగా పోరాడే అవకాశం ఉంది. మరి, టీమ్ ఇండియా రెండో టీ20లోనే సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకుంటుందా? అనేది చూడాలి.
ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనా నేపథ్యంలో భారత్ బ్యాటింగ్ సామర్థ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో టాసే కీలకం. ఇండోర్‌లో రాత్రి ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయే అవకాశముంది. అలాగే.. రాత్రి పెరిగే కొద్దీ మంచు దానిపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోవైపు, విరాట్ కోహ్లీ జట్టులో చేరడంతో విజయానికి తిరుగులేదని భావిస్తున్నారు.గాయం కారణంగా తొలి టీ20కి దూరమైన యశస్వి జైశ్వాల్ కోహ్లీ రాకతో రెండో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రీఎంట్రీ మ్యాచ్‌లో రోహిత్ అనూహ్యంగా రనౌట్‌గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టీ20లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ పిచ్‌పై గతేడాది గిల్ రెండు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గిల్ జోడీపై భారీ అంచనాలు నెలకొనగా..నేటి మ్యాచ్‌లో ఈ జోడీ శుభారంభం అందించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబె అదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అలాగే, తిలక్ వర్మ, జితేశ్ వర్మ, రింకు సింగ్‌ల నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నది.
ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, అఫ్గాన్ రెండో టీ20 నేడు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వెర్క్ చానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే, డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
తుది జట్లు(అంచనా)
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శివమ్ దూబె, జితేశ్ శర్మ/సంజూ శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
ఆఫ్ఘనిస్తాన్ : గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీమ్ జనత్, ఫజాల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.