IND vs AFG : ఆప్ఘనిస్తాన్తో టీ20 సిరీస్.. షెడ్యూల్, టైమింగ్స్ ఇవే! లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
X
సౌతాఫ్రికా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న టీమిండియా.. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే సిరీస్ కోసం సన్నద్దమవుతుంది. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ లో వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును సిద్దం చేస్తుంది. దాదాపు 14 నెలలు టీ20 ఫార్మట్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరారు. జనవరి 11న మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ బ్రాడ్ కాస్టింగ్ బాధ్యతలను వయోకామ్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 చానెల్ లో ప్రసారం అవుతాయి. ఓటీటీలో జియో సినిమా వేదికగా ఫ్రీగా లైవ్ చూడొచ్చు.
బుమ్రా, సిరాజ్, కేఎల్ రాహుల్ లకు ఈ సిరీస్ లో విశ్రాంతినివ్వగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షమీ గాయాల కారణంగా జట్టుకు దూరం అయ్యారు. ఇషాన్ కిషన్ మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
ఇబ్రహీమ్ జడ్రాన్(కెప్టెన్), రషీద్ ఖాన్, గుర్బాజ్, హజాయ్, అలిఖిల్, రెహ్మాత్ షా, మహమ్మద్ నబీ, జడ్రాన్, జనత్, ఓమార్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, అహ్మద్, సలీమ్, అహ్మద్,నైబ్, రషీద్ ఖాన్