IND VS AUS: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
X
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్ సేన.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక ఇవాళ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. నేడు కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కంగారూలు మాత్రం సిరీస్ సమం చేయాలని తహతహలాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 147 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 82 మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. కాగా భారత జట్టు 55 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం లేకుండా ముగిశాయి. భారత గడ్డపై గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా కంగారూలదే పైచేయి. భారత గడ్డపై భారత్, ఆస్ట్రేలియా మధ్య 68 మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు ఆస్ట్రేలియాను 31 సార్లు ఓడించింది. 32 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
గత పోరులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరగడంతో భారత్ విజయం నల్లేరుపై నడక కాగా.. ఈ సారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా.. ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేకపోతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒత్తిడి అధికంగా ఉండనుంది. ఇక ఈ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ చేస్తాడని తెలుస్తోంది. ఇదివరకు గిల్.. ఇండోర్‌లో ఆడిన 2023, ODI ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌పై 112 (78) పరుగులు చేశాడు.