IND U19 vs AUS U19 : 100 పరుగులు దాటేసిన ఆస్ట్రేలియా.. ప్రస్తుత స్కోర్ ఎంతంటే..
X
అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కట్టుదిట్టంగా బంతులేస్తోంది. 22 ఓవర్లు పూర్తయ్యే సరికి 100 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఆ జట్టు కెప్టెన్ హ్యూ విబ్జెన్ (48) ను 20.4 వద్ద ఔట్ అయ్యాడు. నమన్ తివారి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ముషీర్ ఖాన్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే హ్యారీ డిక్సన్(42) కూడా 22.5 వద్ద పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా నమన్ తివారికే దక్కింది. నమన్ బౌలింగ్‌లో మురుగన్ అభిషేక్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 100/3 (23 ఓవర్లు).
ఈ మ్యాచ్ లో.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమ్‌కు తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. భారత బౌలర్ రాజ్ లింబాని కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంగారూలను కంగారు పెట్టేశాడు. ఆ తర్వాత మూడవ ఓవర్ (2.3వ ఓవర్)లో సూపర్ డెలివరీ చేసి సామ్ కొన్స్టాస్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఎనిమిది బంతులాడిన సామ్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 16 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. ఓవర్లలో 100 పరుగులు చేసింది. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడుతోంది.