IND vs NZ ICC World Cup 2023: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్
X
వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో టీమిండియా ఇరగదీస్తోంది. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా న్యూజిలాండ్ (IND vs NZ) తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ తొలి 6 ఓవర్లలోనే 50 పరుగులు దాటేసింది. టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
టిమ్ సౌథీ బౌలింగ్‌లో (8.2వ ఓవర్) భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ (47) విలియమ్సన్ చేతికి చిక్కాడు. దీంతో 71 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను నష్టపోయింది.
ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(4). , శుభమన్ గిల్(25) ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్ తో వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు(50) కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (50*) నిలిచాడు. ఇప్పటి వరకు 49 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్న క్రిస్ గేల్‌ను అధిగమించాడు. కివీస్‌పై ఇప్పటికే మూడు సిక్స్‌లు బాదాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా సిక్సర్లను కొట్టిన బ్యాటర్‌గానూ అవతరించాడు. ప్రస్తుతం రోహిత్ 27 సిక్స్‌లతో కొనసాగుతున్నాడు. అంతకుముందు గేల్ (2015లో) 26 సిక్స్‌లు కొట్టాడు.