Home > క్రీడలు > Asian games 2023 : 100 పతకాలతో దూసుకెళ్తున్న భారత్..

Asian games 2023 : 100 పతకాలతో దూసుకెళ్తున్న భారత్..

Asian games 2023 : 100 పతకాలతో దూసుకెళ్తున్న భారత్..
X

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడతున్నారు. వరుస పతకాలతో తమ సత్తా చాటుతున్నారు. భారత్ ఖాతాలో ఇవాళ మరో మూడు బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఆర్చరీలో రెండు, మహిళల కబడ్డీలో పసిడి పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ పురుషల కాంపౌండ్‌ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్‌ మెడల్‌ సాధించగా.. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇక మహిళల కబడ్డి జట్టు స్వర్ణ పతకంతో దుమ్మురేపింది. అంతేకాకుండా ఆర్చరీలో అభిషేక్ వర్మకు రజతం, అధితి గోపించంద్ కు కాంస్య పతకాలు సాధించారు.

తాజా పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ సెంచరీ కొట్టింది. ఇప్పటివరకు 25 గోల్డ్, 35 రజతం, 40 కాంస్య పతకాలను దక్కించుకుంది. కాగా శుక్రవారం ఒక్క రోజే భారత్కు 8 పతకాలు వచ్చాయి. మెన్స్ హాకీలో స్వర్ణం, మెన్స్ బ్రిడ్జ్ టీంలో రజతం, మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో (అమన్‌ సెహ్రావత్‌) కాంస్యం, ఉమెన్‌ 76 కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో (కిరణ్‌ బిష్ణోయి) కాంస్యం, ఉమెన్‌ 62 కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో (సోనం మాలిక్‌) కాంస్యం పతకాలు సాధించారు. సెపాక్ టక్రా ఉమెన్స్ టీంకు కాంస్యం, బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో హెస్ ప్రణయ్కు కాంస్యం, ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీంలో అతాను, ధీరజ్, తుషార్ లకు రజత పతకాలు లభించాయి.

Updated : 7 Oct 2023 6:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top