Home > క్రీడలు > భారత ఓపెనర్స్ రికార్డ్.. చిత్తుగా ఓడిన విండీస్

భారత ఓపెనర్స్ రికార్డ్.. చిత్తుగా ఓడిన విండీస్

భారత ఓపెనర్స్ రికార్డ్.. చిత్తుగా ఓడిన విండీస్
X

వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత్ చెలరేగింది. విండీస్ జట్టును 200 రన్స్ తేడాతో చిత్తుగా ఓడించి.. 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఓడినా మూడో వన్డేలో విండీస్కు భారీ టార్గెట్ ను ఇచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన విండీస్ భారత బౌలర్ల దెబ్బకు 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడకున్నా.. యువ ఆటగాళ్లు అదరగొట్టారు. రెండో వన్డేలా కాకుండా సమిష్టిగా రాణించి ఇండియాకు సిరీస్ను అందించారు.

ఓపెనర్స్ రికార్డ్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు అదిరే శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్ కు 143న చేసి రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. 143 రన్స్ వద్ద ఇషాన్ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరాడు. వరుస మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో సిక్సర్లతో హోరెత్తించారు. సంజూ, గిల్ దంచికొట్టడంతో 28 ఓవర్లకే భారత్ 200 రన్స్ చేసింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ తర్వాత శాంసన్ ఔట్ అవ్వగా.. ఆ వెంటనే గిల్ కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ 50ఓవర్లకు 351 రన్స్ చేసింది.


విండీస్ చిత్తు..

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి మూడు వికెట్లను పడగొట్టి ముకేష్ కుమార్ విండీస్ నడ్డి విరిచాడు. ఆ తర్వాత ఉనద్కత్ ఒకటి, శార్ధుల్ ఠాకూర్ రెండు వికెట్లను పడగొట్టడంతో విండీస్ 50 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత నిలకడగా ఆడిన అథనేజ్‌, కరియాలను కుల్‌దీప్‌ యాదవ్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేశారు. దీంతో విండీస్‌ 88/8 స్కోరుతో నిలిచి వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే అల్జారీ జోసెఫ్‌, గుడాకేష్‌ మోటీ నిలకడగా ఆడి..తొమ్మిదో వికెట్ కు 50రన్స్ పాట్ నర్ షిప్ చేయడంతో విండీస్ స్కోర్ 150 దాటింది. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ కుమార్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

Updated : 2 Aug 2023 7:43 AM IST
Tags:    
Next Story
Share it
Top