Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. మెన్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్..
X
ఏషియన్ గేమ్స్లో భారత ఆటగాళ్ల జోరు మొదలైంది. 10 మీటర్ల మెన్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్ పన్వర్, ప్రతాప్ సింగ్ తోమర్ టీం ఫైనల్‌లో 1893.7 పాయింట్లు నమోదు గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రస్తుతం టీమ్ ఇండియా అకౌంట్లో ఒక గోల్డ్, 3 సిల్వర్, ఒక కాంస్య పతకం ఉన్నాయి.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీంగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. జస్విందర్, భీం, పునీత్, ఆశిష్ బృందం 6:10.81 నిమిషాల్లో రేసు పూర్తి చేసింది.