Home > క్రీడలు > కూత దొరికింది.. ఎనిమిదోసారి ఛాంపియన్గా భారత్

కూత దొరికింది.. ఎనిమిదోసారి ఛాంపియన్గా భారత్

కూత దొరికింది.. ఎనిమిదోసారి ఛాంపియన్గా భారత్
X

భారత కబడ్డీ ఆటగాళ్లు మరోసారి సత్తా చాటారు. ఆసియా కప్ లో రెచ్చిపోయి.. ఇరాన్ ను చిత్తు చేశారు. శుక్రవారం (జూన్ 30) జరిగిన ఫైనల్ లో 42-32 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ఈ గెలుపుతో భారత్ ఏనిమిదో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆసియా కప్ లో భాగంగా.. సౌత్ కొరియాలోని బుసాన్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. జూన్ 27న ప్రారంభమైన ఈ టోర్నీలో మూడు రోజుల పాటు ఆరు మ్యాచ్ లు జరిగాయి. పాయింట్స్ టేబుల్ లో టాప్2లో నిలిచిన భారత్.. ఫైనల్ లో పుంజుకుని టాప్1లో ఉన్న ఇరాన్ ను చిత్తు చేసింది.

ఫైనల్ లో సత్తా చాటిన భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్స్ సాధించాడు. మ్యాచ్ లో తొలి ఐదు నిమిషాలు వెనుకబడ్డ భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. మ్యాచ్ 10వ నిమిషంలో ఇనాందార్, పవన్ సక్సెస్ ఫుల్ రైడ్స్ తో ఆటను భారత్ వైపు తిప్పారు. దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్ 23-11 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. రెండో రౌండ్ లో మ్యాచ్ హోరాహెరాగా సాగింది. ఓ దశలో 38-31 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత గేర్ మార్చిన భారత్.. పుంజుకుని 42-32 పాయింట్స్ సాధించి ఎనిమిదో టైటిల్ ను ఎగరేసుకుపోయింది.




Updated : 30 Jun 2023 5:57 PM IST
Tags:    
Next Story
Share it
Top