Home > క్రీడలు > IND vs AUS : రెండో వన్డేలో ఆసీస్ ఆలౌట్.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

IND vs AUS : రెండో వన్డేలో ఆసీస్ ఆలౌట్.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

IND vs AUS : రెండో వన్డేలో ఆసీస్ ఆలౌట్.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
X

ఇండియా - ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ టీమిండియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగినరెండో వన్డేలో ఆసీస్పై 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఓవర్లను కుదించారు. ఆసీస్ 33 ఓవర్లకు 317 రన్స్ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే లక్ష్యఛేదనలో ఆసీస్‌ ఘోరంగా విఫలమైంది. 217 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆల్‌రౌండర్ సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌)లతో అనుహ్యంగా చెలరేగాడు. టాపార్డర్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53; 39 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేయగా.. లబుషేన్ (27) జోష్ హాజిల్‌వుడ్ (23)పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్‌ 2, షమి ఒకటి వికెట్ చొప్పున తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆస్ట్రేలియాకు 400 పరుగుల లక్ష్యం ఇచ్చింది. శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) సెంచరీలతో విరుచుకుపడగా.. మ్యాచ్ ఆఖరిలో సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (52) అర్ధ సెంచరీతో చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (31) రన్స్ చేశాడు. రుతురాజ్‌ (8) పరుగులకే పరిమితమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో కెమరూన్‌ గ్రీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Updated : 24 Sep 2023 5:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top