Home > క్రీడలు > Asian games 2023: బంగ్లాను చిత్తు చేస్తూ.. ఫైనల్కు దూసుకెళ్లారు

Asian games 2023: బంగ్లాను చిత్తు చేస్తూ.. ఫైనల్కు దూసుకెళ్లారు

Asian games 2023: బంగ్లాను చిత్తు చేస్తూ.. ఫైనల్కు దూసుకెళ్లారు
X

ఏషియన్ గేమ్స్ లో భారత్ పురుషుల క్రికెట్ జట్టు సత్తా చాటింది. సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. మరో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన టీమిండియా కుర్రాళ్లు.. బంగ్లాపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. భారత బౌలర్ల దాటికి ఏ బంగ్లా బ్యాటర్ క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ 96 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు వాషింగ్టన్ సుందర్ 2, సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్నోయ్, షాదాబ్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు వీర విహారం చేశారు. కేవలం 9.2 ఓవర్లలోనే టార్గెట్ ను (97) చేదించారు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డకౌట్ అయి అందరినీ కంగారు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మతో (55 నాటౌట్) మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్) రెచ్చిపోయి ఆడాడు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ.. చెలరేగారు. దీంతో భారత్ కు మరో పతకం ఖాయం అయింది. మరో సెమీఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్- అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతుండగా.. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరి భారత్ తో తలపడుతుంది.

Updated : 6 Oct 2023 11:24 AM IST
Tags:    
Next Story
Share it
Top