Home > క్రీడలు > సౌతాఫ్రికాను చిత్తు చేసి.. వరల్డ్కప్లో ఫైనల్కు చేరిన టీమిండియా

సౌతాఫ్రికాను చిత్తు చేసి.. వరల్డ్కప్లో ఫైనల్కు చేరిన టీమిండియా

సౌతాఫ్రికాను చిత్తు చేసి.. వరల్డ్కప్లో ఫైనల్కు చేరిన టీమిండియా
X

Under-19 WCలో టీమిండియా ఫైనల్ చేరింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్ లో.. సౌతాఫ్రికాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల చేసింది. ఓపెనర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ (76), మిడిల్ ఆర్డర్ లో రిచర్డ్ సెలెట్స్వేన్ (64) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబనీ 3, ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. నమన్ తివారీ, సౌమీ పాండే చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట తడబడింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆదర్శ్ సింగ్ డకౌట్ కాగా, అర్షిన్ కులకర్ణీ (12), ముషీర్ ఖాన్ (4) తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యారు.

32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ ఉదయ్ (81), సచిన్ దాస్ (96) వీరోచితంగా పోరాడారు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. క్వేనా మఫాకా, ట్రిస్టన్ లూస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ లో గెలిచిన జట్టు.. ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది.

Updated : 6 Feb 2024 9:54 PM IST
Tags:    
Next Story
Share it
Top