Asian Games 2023: ఏషియన్ గేమ్స్లో పతకాల పంట.. ఒక్కరోజులోనే..
X
ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల పంట పండుతోంది. ఇప్పటి వరకు భారత్ 60 పతకాలు సాధించింది. అందులో 13 బంగారు, 24 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తం 60 పతకాలతో భారత్ పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఇవాళ ఒక్కరోజే భారత్ 7 పతకాలను సొంతం చేసుకుంది. తాజాగా 4×400 మీటర్ల రేసులో భారత్ కు సిల్వర్ దక్కింది. నిజానికి ఈ ఈవెంట్ లో భారత్ కు కాంస్యం రావాల్సింది. కానీ చివర్లో అంపైర్ శ్రీలంకపై అనర్హత వేటు వేయడంతో భారత్ కు సిల్వర్ దక్కింది. అంతకుముందు లాంగ్ జంప్ లో భారత మహిళా అథ్లెట్ ఎన్సీ సోజన్ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఈరోజు ప్రారంభంలో స్కేటర్లు 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. ఇదిలా ఉండగా భారత హాకీ జట్టు 12-0 తో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి సెమీ ఫైనల్ కు చేరుకుంది. హర్మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా 5 మ్యాచుల్లో గెలిచింది. ఇక రేపు భారత పురుషుల జట్టు తమ మొదటి మ్యాచ్ నేపాల్ తో ఆడుతుంది.