అశ్విన్ మాయ.. విండీస్పై టీమిండియా ఘన విజయం
X
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సీజన్ లో శుభారంభం అందించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా దెబ్బకు కరీబియన్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వరసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 130 రన్స్ కే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 7 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా 2, సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ను భారత్ 3 రోజుల్లోనే ముగించడం విశేషం.
ఓవర్ నైట్ స్కోర్.. 312/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్, 421/5 వద్ద డిక్లేర్ చేసింది. జైశ్వాల్ 171, 387 బంతుల్లో, విరాట్ కోహ్లీ 76, 182 బంతుల్లో భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. చివర్లో జడేజా 37 నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోసెఫ్, రఖీమ్ కార్న్‌వాల్, వారికన్, అథనేజ్ చెరో వికెట్ దక్కాయి. విండీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరు క్రీజ్ లో నిలవలేక పోయారు. దాంతో మొదటి ఇన్నింగ్స్ లో 150, రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకు కుప్పకూలింది.