Home > క్రీడలు > ఐర్లాండ్-ఇండియా మ్యాచ్ కు హౌస్ ఫుల్

ఐర్లాండ్-ఇండియా మ్యాచ్ కు హౌస్ ఫుల్

ఐర్లాండ్-ఇండియా మ్యాచ్ కు హౌస్ ఫుల్
X

టీమ్ ఇండియా ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా స్టేడియం నిండిపోవాల్సిందే. చిన్న టీమ్ తో ఆడుతోందా..పెద్ద టీమా అన్నది ప్రశ్నే కాదు. మనవాళ్ళు ఆడుతున్నారు, అది భారతీయులు చూడాలి. భారత క్రికెట్ జట్టు ఫ్యాన్స్ పండగ చేసుకోవాలి అంతే. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ల్లో అదే కనిపిస్తోంది. మొదటి మ్యాచ్ కు ష్టేడియం అంతా బుక్ అయిపోయింది. హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేశారు.

ఐర్లాండ్ లో భారతీయులు ఎక్కువ మందే ఉంటారు. అందుకే ఇక్కడ ఆడటానికి వచ్చిన టీమ్ ఇండియాను చూడ్డానికి జనాలు ఎబడ్డారు. మొత్తం టికెట్లన్నీ కొనేశారు. మొదటి రెండు మ్యాచ్ ల టికెట్లు అయిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. మూడో టి20 టికెట్ల విక్రయం కూడా త్వరలోనే ఆరంభిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. టీమ్ ఇండియాతో మ్యాచ్ లకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడం పట్ట బోర్డు హర్ష్ వ్యక్తం చేస్తోంది.

దాదాపు ఏడాది తర్వాత బుమ్రా ఎక్స్ ప్రెస్ భారత జట్టులోకి అడుగుపెడుతున్నాడు. బుమ్రా ఫిట్ నెస్ నిరూపించుకోవడానికి ఐర్లాండ్ తో జరిగే ఈ సీరీస్ ఉపయోగపడనుంది. టీమ్ ఇండియా ఇంతకు ముందు 2018, 2022లలో ఐర్లాండ్ పర్యటించింది. అలాగే ఈ జట్టుతో భారత్ టీ20 మ్యాచ్ లలో 5 సార్లు తలపడింది. అయితే ఇలా 3 మ్యాచ్ ల సీరీస్ లా ఆడటం మాత్రం ఇదే మొదటిసారి.


Updated : 17 Aug 2023 6:23 PM IST
Tags:    
Next Story
Share it
Top