IND vs ENG : ముగిసిన మూడో రోజు ఆట.. భారత బ్యాటర్ల మెరుపులు
X
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టును 319 రన్స్కే ఆలౌట్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లోనూ దూకుడుగా ఆడుతోంది. మధ్యాహ్నం వరకే ఇంగ్లాండ్ను కుప్పకూల్చిన భారత్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగగా.. గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 2 వికెట్లు నష్టపోయి 196 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్పై 322 రన్స్ లీడ్లో ఉంది.
జైశ్వాల్కు టెస్టుల్లో మూడో సెంచరీ కాగా.. ఈ సిరీస్లోనే రెండు శతకాలు బాదాడు. అయితే 104 రన్స్ చేసిన తర్వాత అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పటిదార్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) ఉన్నారు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ 19 పరుగులకే ఔట్ అయ్యాడు. అంతకుముందు బౌలింగ్లో సిరాజ్ చెలరేగడంతో ఇంగ్లాండ్ 319 రన్స్కే ఆలౌట్ అయ్యింది. పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. లంచ్‌కు ముందు 290/ 5తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే చాప చుట్టేసింది. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 రన్స్ చేసింది.