Home > క్రీడలు > IND vs AUS : మూడో వికెట్ కోల్పోయిన భారత్.. 74 పరుగుల వద్ద గిల్ ఔట్..

IND vs AUS : మూడో వికెట్ కోల్పోయిన భారత్.. 74 పరుగుల వద్ద గిల్ ఔట్..

IND vs AUS : మూడో వికెట్ కోల్పోయిన భారత్.. 74 పరుగుల వద్ద గిల్ ఔట్..
X

భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆడం జంపా బౌలింగ్ లో 74 పరుగుల వద్ద శుభ్ మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు మాథ్యూ షార్ట్ బౌలింగ్ లో వరుస బౌండరీలు, సిక్సర్ కొట్టిన గిల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

మరోవైపు టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7ఫోర్లు కొట్టి ఈ ఘనత సాధించారు. అయితే 142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రుతురాజ్‌ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక 148 రన్స్ వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (3) రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు.

Updated : 22 Sept 2023 8:42 PM IST
Tags:    
Next Story
Share it
Top