India vs England : న్యూజిలాండ్ ఓటమి.. టాప్లోకి టీమిండియా
X
టెస్టుల్లో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడంతో భారత్ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. నిన్నటివరకు న్యూజిలాండ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. భారత్ రెండు, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. అయితే కివీస్ ఓటమి భారత్కు కలిసొచ్చింది. ప్రస్తుతం టీమిండియా 64.58 విన్నింగ్ పర్సెంటేజ్తో మొదటి స్థానంలో ఉండగా.. 60శాతంతో న్యూజిలాండ్ సెకండ్, 59.09 శాతంతో ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్లో ఉన్నాయి.
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సీజన్ నడుస్తోంది. 2025 మార్చిలోపు టాప్లో ఉన్న రెండు జట్లు ఫైనల్లో ఆడతాయి. ఇప్పటికే భారత్ రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరింది. ఈ సారి కూడా ఫైనల్ చేరి హ హ్యాట్రిక్ కొట్టాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ పై ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. ఈ నెల 7నుంచి చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ మూడింట గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. చివరి టెస్టులోనూ గెలిస్తే విన్నింగ్ పర్సంటేజ్ మరింత పెరగనుంది. మార్చి 8 నుంచి ఆసీస్-కివీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది