Home > క్రీడలు > IND vs ENG : బౌలర్లపైనే భారత్ ఆశలు.. ఇంగ్లాండ్కు చెక్ పెడుతుందా..?

IND vs ENG : బౌలర్లపైనే భారత్ ఆశలు.. ఇంగ్లాండ్కు చెక్ పెడుతుందా..?

IND vs ENG : బౌలర్లపైనే భారత్ ఆశలు.. ఇంగ్లాండ్కు చెక్ పెడుతుందా..?
X

విశాఖలో టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ చివరి దశకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 399పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు చేధించే పనిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 67 రన్స్ చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్ (28)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. క్రీజ్‌లో జాక్‌ క్రాలే (29*), రెహాన్ అహ్మద్ (9*) ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి 332 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు 9 వికెట్లు కావాలి. ఈ క్రమంలో భారత్ ఆశలన్నీ బౌలర్లపైనే ఉన్నాయి.

బౌలర్లపైనే ఆశలు..

ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను దెబ్బకొట్టిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లోనూ అదే మ్యాజిక్ చేస్తే భారత్ ఈజీగా గెలవడం ఖాయం. ఇక రెండో ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ తీసీ ఊపుమీదున్న అశ్విన్ దానిని కంటిన్యూ చేస్తే ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కు కట్టడి చేయొచ్చు. ఇంగ్లండ్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ ఉండాలి. ఉప్పల్ టెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటారా లేక అప్పటిలాగే రెండో ఇన్నింగ్స్లో బోల్తా పడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే భారత గడ్డపై ఇప్పటివరకు ఏ జట్టు 300+ రన్స్ను చేధించలేదు.

అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో భారత్ కు మంచి స్కోర్ ను అందించాడు. గిల్కు అక్షర్ పటేల్ (45) తోడవడంతో టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. అయితే మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు. ఓవర్‌ నైట్‌ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్ 9, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్ 6, అశ్విన్ 29, కుల్దీప్, బుమ్రా డకౌట్గా నిలిచారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4 వికెట్లతో చెలరేగగా..రెహన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, బషీర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది

Updated : 5 Feb 2024 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top