Home > క్రీడలు > IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం

IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం

IND vs AFG: బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం
X

టీ20 వరల్డ్ కప్ 2024లో గెలుపే లక్ష్యంగా సన్నాహాలు మొదలుపెట్టింది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మూడు మ్యాచుల టీ20 సీరీస్ లో ఇవాళ తొలి మ్యాచ్ లో జరగనుంది. మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనని బీసీసీఐ చెప్పాడు. కీలక సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ కు బారీ షాక్ తగిలింది. స్పిన్నర్ రషిద్ ఖాన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. కాగా 14 నెలల తర్వాత టీ20 ఫార్మట్ లో అడుగుపెట్టిన రోహిత్ శర్మపైనే అందరి కళ్లు ఉన్నాయి.

తుది జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ ఉర్హక్,

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్




Updated : 11 Jan 2024 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top