వరల్డ్ కప్ లో భారత్ -పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్?
X
అక్టోబర్ లో వన్టే ప్రపంచకప్ మొదలవుతోంది. అందులో అక్టోబరర్ 15న భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ జరగనుంది అని ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ డేట్ న మార్చాలని ఐసీసీ ఆలోచిస్తోందిట. ఈ అంశం పరిశీలనలో ఉందని బీసీసీఐ ప్రతినధి ఒకరు చెప్పారు.
అక్టోబర్ 15 నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వారు జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించి, పదవ రోజున దసరా పండగ చేసుకుంటారు. గుజరాత్ వాళ్ళకు ఇది చాలా ముఖ్యమైన పండగ. భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ కరెక్ట్ గా నవరాత్రులు మొదటిరోజు జరగనుంది. అది కూడా అహ్మదాబాద్ లో. దీనివలన భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే మామూలుగానే టెన్షన్స్ ఉంటాయి. అదొక యుద్ధంలా భావిస్తారు అందరూ. అందులో ఇలాంటి రోజు అంటే మరీ ఎక్కువ ఉంటుందని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించాయిట.
అమ్మదాబాద్ లో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. నగరంలో ఉత్సవాలు జరుగుతాయి. దానికోసం ట్రాఫిక్ రూల్స్, ఆంక్షలు ఉంటాయి. భారత్ -పాక్ మ్యాచ్ కు వేలాది మంది అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఆంక్షల టైమ్ లో మ్యాచ్ ను చూడ్డానికి వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బంది అవుతుంది. అందుకే మ్యాచ్ ను ఒకరోజు ముందుకు ప్రీపోన్ చేస్తే మంచిదని సెక్యూరిటీ ఏజెన్సీలు అంటున్నాయి. అప్పుడు అయితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అంటున్నారు. బీసీసీఐ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.