Home > క్రీడలు > INDvsAFG : సెంచరీతో చెలరేగిన రోహిత్.. టీమిండియా భారీ స్కోర్

INDvsAFG : సెంచరీతో చెలరేగిన రోహిత్.. టీమిండియా భారీ స్కోర్

INDvsAFG : సెంచరీతో చెలరేగిన రోహిత్.. టీమిండియా భారీ స్కోర్
X

బెంగళూరు వేదికగా భారత్ - ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 69 బంతుల్లో 121 రన్స్తో చుక్కలు చూపెట్టాడు. రింకూ సింగ్ (69) హాఫ్ సెంచరీతో రాణించాడు. 22 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను వీరద్దరూ ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా స్కోర్ ను పరుగులు పెట్టించారు. 18 రన్స్ దగ్గర జైస్వాల్ (4), కోహ్లీ (0) ఔట్ అవ్వగా, 21రన్స్ వద్ద శివమ్ దూబే (1), 22 రన్స్ వద్ద సంజూ శాంసన్ (0) ఔట్ అయ్యారు.

కాగా ఈ సిరీస్లో టీమిండియా అదరగొడుతుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ విజయంతో టీ20 ఫార్మట్లో చరిత్ర లిఖించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచులో గెలిస్తే.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వైట్ వాష్లు చేసిన జట్టుగా భారత్ నిలుస్తుంది. ఇప్పవరకు ద్వైపాక్షిక టీ20 సిరీసుల్లో అత్యధిక వైట్ వాష్లు (8) చేసిన జట్లుగా.. భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్గాన్ను ఓడిస్తే.. మొత్తం 9 క్లీన్ స్వీప్లతో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా అవతరిస్తుంది. అయితే ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆఫ్గాన్ ప్రయత్నిస్తోంది.

Updated : 17 Jan 2024 9:02 PM IST
Tags:    
Next Story
Share it
Top