Home > క్రీడలు > Ind vs Aus : టీమిండియా ఆలౌట్.. ఆశలన్నీ బౌలర్ల పైనే..

Ind vs Aus : టీమిండియా ఆలౌట్.. ఆశలన్నీ బౌలర్ల పైనే..

Ind vs Aus   : టీమిండియా ఆలౌట్.. ఆశలన్నీ బౌలర్ల పైనే..
X

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తక్కువ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 240 రన్స్కు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ 66, కోహ్లీ 54,రోహిత్ 47 రన్స్తో రాణించారు. మిగితా బ్యాట్స్మెన్స్లలో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ హాజిల్‌వుడ్ 2,పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ బౌలర్లపైనే ఉంది. షమీ, బుమ్రా రాణిస్తే ఇండియా గెలవడం ఖాయం.

కాగా ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 30 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత 9.4వ ఓవర్లో రోహిత్ శర్మ (47) ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ (4) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 81 పరుగులకే టిమిండియా మూడో వికెట్లు నష్టపోయింది. ఆ తర్వాత 54 రన్స్ చేసిన కోహ్లీ బౌల్డ్ అవ్వగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి.


Updated : 19 Nov 2023 12:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top