Home > క్రీడలు > దంచికొట్టిన టీమిండియా.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

దంచికొట్టిన టీమిండియా.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

దంచికొట్టిన టీమిండియా.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
X

వన్డే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌లో టీమిండియా దంచికొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో 397 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగి.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. గిల్ 80, రోహిత్ 47 రన్స్తో రాణించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ముందు నుంచే దూకుడుగా ఆడాడు. 29 బాల్స్లో 47 రన్స్ చేసి సౌథీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గిల్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ అవడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి కోహ్లీ కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ 113 బంతుల్లో 117, అయ్యర్ 70 బంతుల్లో 105 రన్స్ చేశారు. అయ్యర్ ఏకంగా 8 సిక్సులతో రఫ్పాడించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

ఇక ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ గాడ్ సచిన్ నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన క్షణానికి వాంఖడే స్డేడియం సాక్ష్యంగా నిలిచింది. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 50 సెంచరీల చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ తన కేరీర్లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు చేశాడు. అటు కింగ్ కోహ్లీ మాత్రం 291 మ్యాచ్‌లలో ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అటు హాఫ్ సెంచరీల్లోనూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 120 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును 120 హాఫ్ సెంచరీలతో కోహ్లీ బద్దలగొట్టాడు. కాగా 145 హాఫ్ సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు.

Updated : 15 Nov 2023 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top