Home > క్రీడలు > గెలుపు ముంగిట టీమిండియా.. కావాల్సింది 79 పరుగులే.. కానీ..!

గెలుపు ముంగిట టీమిండియా.. కావాల్సింది 79 పరుగులే.. కానీ..!

గెలుపు ముంగిట టీమిండియా.. కావాల్సింది 79 పరుగులే.. కానీ..!
X

టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. మరో 79 పరుగులు చేస్తే.. సిరీస్ సమం చేయడంతో పాటు.. రెండో రోజే ఆటను ముగించిన జట్టుగా నిలుస్తుంది. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాను.. 78 పరుగులకే కుప్ప కూల్చారు. సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. ముకేశ్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ మార్క్రమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో (106, 103 బంతుల్లో, 17 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి.. జట్టు 176 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మార్క్రమ్ మినహా.. ఏ బ్యాటర్ కూడా చెప్పుకొదగ్గ స్కోర్ చేయలేకపోయారు. డీన్ ఎల్గర్ (12), డేవిడ్ బెడింగామ్ (11), మార్కో జాన్సన్ (11) మినహా ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.

62 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలు.. ఏ దశలోనూ ఇన్నింగ్స్ ను నిలబెట్టలేకపోయారు. టీమిండియా బౌలర్ల దాటికి క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో లంచ్ బ్రేక్ కు ముందే.. సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా సులువగా గెలుస్తుంది. 79 పరుగుల ఈజీ టార్గెట్ ను చేదిస్తుందని అనుకుంటున్నారు. అయితే మరోపక్క సౌతాఫ్రికా బౌలింగ్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే.. 153/4 పటిష్టంగా ఉన్న టీమిండియాను.. కేవలం 11 బంతుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టింది. దీంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కాగా రెండో టెస్ట్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా భావిస్తుంది.



Updated : 4 Jan 2024 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top