13, 14, 15 పరుగులా.. వాళ్లు బాగా ఆడుతున్నారా.. మన వాళ్లకు ఆడొస్తలేదా..!
Mic Tv Desk | 8 Jun 2023 9:42 PM IST
X
X
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆధిపత్యం ప్రదర్శించామన్న ఆనందం కొంతసేపు కూడా లేదు. భారీ అంచనాలు నెలకొల్పిన మన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్ 71 పరుగులకే భారత్ 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శుభారంభాన్ని అందిస్తారనుకున్న ఓపెనర్లు రోహిత్ (15), గిల్ (13) చేతులెత్తేశారు. దాంతో 30 పరుగుల వ్యవధిలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది.
తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ పుజారా (14), కోహ్లీ (14) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. మొదట బౌండరీలు బాది, కాస్త కుదురుకున్నారు అనిపించినా.. ఆసీస్ బౌలర్లు విసిరే బంతుల్ని అంచనా వేయలేక ఔటైపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్, బోలాండ్, గ్రీన్.. చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రహానే 17, జడేజా 18 ఉన్నారు.
Updated : 8 Jun 2023 9:42 PM IST
Tags: wtc wtc final world test championship latest news ind vs aus india vs australia telugu news live score bcci icc win probability cricket news sports news team india score virat kohli rohit sharma pujara gill
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire