Home > క్రీడలు > India Vs Afghanistan: సొంతగడ్డపై నేడు అఫ్గనిస్థాన్‌తో భారత్ తొలి సమరం..

India Vs Afghanistan: సొంతగడ్డపై నేడు అఫ్గనిస్థాన్‌తో భారత్ తొలి సమరం..

India Vs Afghanistan: సొంతగడ్డపై నేడు అఫ్గనిస్థాన్‌తో భారత్ తొలి సమరం..
X

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు అఫ్గానిస్థాన్‌తో భారత్​ తలపడనుంది. పంజాబ్​లోని మొహాలీ వేదికగా సాయంత్రం 7 గంటలకు తొలి మ్యాచ్​ జరగనుంది. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024 కు ముందు భార‌త్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే. అంతే కాకుండా 14 నెలల తర్వాత భారత స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 క్రికెట్లోకి రావడం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. ఈ సిరీస్‌కు వారిని సెలక్ట్ చేయడం ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వారు ఉంటారంటూ సెలక్టర్లు సంకేతాలు ఇచ్చారు. అయితే కోహ్లీ రీఎంట్రీ ఇచ్చినా వ్యక్తిగత కారణాలతో అతడు ఈ ఫస్ట్ మ్యాచ్‌కు దూరం కానున్నాడని, తర్వాతి రెండు టీ20లకు విరాట్‌ అందుబాటులో ఉంటాడని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పారు.

ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ కీలక ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ దూరం కానున్నాడు. గత ఏడాది వెన్నుకు సర్జరీ చేయించుకున్న రషీద్‌.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే, రషీద్ ఖాన్ లేకపోయినా భారత జట్టును ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ జట్టుకు ఉందని ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ టీ20 సిరీస్‌లో భారత్‌పై గెలుస్తామని చెప్పాడు. మ్యాచ్‌ గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

తుది జట్ల అంచనా

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్). ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్ రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జానా, అజ్ముల్లా ఉమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ రహమాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్.

భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు

స్పోర్ట్స్ 18 నెట్ వ‌ర్క్ భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయ‌నుంది. అలాగే, జియో సినిమా యాప్, వెబ్ సైట్ లో కూడా టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ను ఉచితంగా చూడ‌వ‌చ్చు.

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్

తొలి టీ20- 11 జనవరి- మొహాలీ

రెండో టీ20- 14 జనవరి- ఇండోర్

మూడో టీ20- 17 జనవరి- బెంగళూరు

Updated : 11 Jan 2024 7:54 AM IST
Tags:    
Next Story
Share it
Top