India vs Australia: ఆసీస్కు చుక్కలు చూపిస్తూ.. శ్రేయస్, గిల్ సెంచరీ
X
ఇండోర్ వేదికపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి సెంచరీలు సాధించారు. మొదటి బంతి నుంచే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. గాయం కారణంగా జట్టుకు దూరం అయిన అయ్యర్.. ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. దీంతో వరల్డ్ కప్ ఆశలు సన్నగిల్లుతాయి అనుకున్న టైంలో తిరిగి ఫామ్ లోకి వచ్చి సూపర్ సెంచరీ చేశాడు. మొత్తం 88 బంతుల్లో 101 పరుగులు చేసిన అయ్యర్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. వన్డేల్లో 3 సెంచరీ సాధించాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తాడనుకుంటే.. అబాట్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
గిల్ సెంచరీ..:
ఓపెనర్ గా వచ్చిన గిల్ రెచ్చిపోయాడు. వన్డేల్లో 6 సెంచరీలు సాధించాడు. 92బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో పరుగులు చేశాడు. సీనియర్లలు లేరనే ఒత్తిడిలో కూడా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది టీమిండియా. కెప్టెన కేఎల్ రాహుల్ కూడా దాటిగా ఆడుతున్నాడు. దీంతో భారత్ 400 పరుగుల భారీ స్కోర్ చేసేలా కనిపిస్తుంది.