Home > క్రీడలు > INDvs AUS U19 : అండర్‌-19 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

INDvs AUS U19 : అండర్‌-19 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

INDvs AUS U19 : అండర్‌-19 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
X

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్2024 విజేత‌గా ఆస్ట్రేలియా నిలిచింది. అండర్ 19 ప్రపంచ కప్‌ టైటిల్​ను కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా యువ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఆదివారం ద‌క్షిణాఫ్రికాలోని బెనోనిలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో ఆసీస్​ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా స్కోర్​ 253/7, భారత్‌ మాత్రం 174 పరుగుకే ఆలౌటైంది. ఇక అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నాలుగోసారి సాధించింది.

254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 43.5 ఓవ‌ర్ల‌లో 174 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) రాణించ‌గా.. ముషీర్ ఖాన్ (22) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్ (8), స‌చిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) ల‌తో పాటు మిగిలిన వారు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో టీమ్ఇండియాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మహ్లీ బార్డ్‌మాన్, రాఫ్ మాక్‌మిల్లన్ చెరో మూడు వికెట్లు తీశారు. కల్లమ్ విడ్లర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్ లు చెరో వికెట్ సాధించారు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 253 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో హర్జస్‌ సింగ్‌ (55) హాఫ్ సెంచ‌రీ చేశారు. హగ్‌ వెబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46), హ్యారీ​ డిక్సన్‌ (42) లు రాణించారు. సామ్‌ కాంస్టాస్ (0), రాఫ్‌ మెక్‌మిలన్ (2) విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో రాజ్‌ లింబాని మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నమన్‌ తివారి రెండు వికెట్లు తీశాడు. సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్ చెరో వికెట్ సాధించారు. గ‌తేడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో టీమ్ఇండియా సీనియ‌ర్లు ఓడిపోగా ఇప్పుడు జూనియ‌ర్లు సైతం అదే జ‌ట్టు చేతిలోనే ఓడిపోవ‌డంతో కోట్లాది మంది అభిమానులు మ‌రోసారి తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు.




Updated : 11 Feb 2024 4:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top