Home > క్రీడలు > IND vs AUS : బరిలోకి దిగిన టీమిండియా.. బ్యాటింగ్ మొదలు

IND vs AUS : బరిలోకి దిగిన టీమిండియా.. బ్యాటింగ్ మొదలు

IND vs AUS : బరిలోకి దిగిన టీమిండియా.. బ్యాటింగ్ మొదలు
X

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55 ) , హ్యూ వీబ్జెన్ (48) , డిక్సన్ (42) ఓలివర్ (46) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇక.. కాసేపటి క్రితమే టీమిండియా బ్యాటింగ్ మొదలైంది. ఆదర్శ్ సింగ్, ఆర్షిన్ కులకర్ణి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా టోర్నీలో అడుగుపెట్టిన భార‌త్ లీగ్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గత ఏడాది నవంబర్ 19న భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకునేందుకు యువ భారత్‌ సిద్ధమైంది

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా బెనోనిలో విల్లోమూర్ పార్క్‌లో జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ నిలకడగా రాణిస్తోన్న యువ భారత్‌.. ఆసీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని బ్రేక్ చేయనుంది. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. అండర్ 19 ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడ్డాయి. రెండు సార్లు కంగారులను ఓడించి ట్రోఫిని ముద్దాడిన భారత్ ఒకసారి మాత్రం ఓడిపోయింది. ఇప్పుడు 2024లో విజయం సాధించి వరుసగా రెండోసారి కప్పును గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా చూస్తోంది.




Updated : 11 Feb 2024 5:58 PM IST
Tags:    
Next Story
Share it
Top