IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బౌలింగ్..
X
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ (Team India).. మరో సమరానికి సిద్ధమైంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఇక.. బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయంతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టాస్ నెగ్గింది. ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో కొనసాగుతున్న టీమ్‌ఇండియాను ఢీకొట్టడం బంగ్లాకు తేలికైన విషయం కాదు. కానీ, సంచలనాలు నమోదవుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ ఆడటం లేదు. ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోవడంతో అతడికి మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో షకిబ్ స్థానంలో షాంటో కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు.
బంగ్లాదేశ్ జట్టు
లిటన్ దాస్, తన్జిద్ హసన్, నజ్ముల్ షాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహమ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమ్మద్, ముస్తాఫిజర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్
భారత్ టీమ్..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 40 వన్డేలు జరిగాయి. భారత్ 31, బంగ్లాదేశ్ 8 గెలిచాయి. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ప్రస్తుతం రోహిత్ సేన ఖాతాలో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.