Home > క్రీడలు > IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!

IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!

IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!
X

విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో.. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్‌లో జాక్‌ క్రాలే (29*), రెహాన్ అహ్మద్ (9*) ఉన్నారు. ఓపెనర్‌ బెన్‌ డకెట్ (28)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ విజయానికి 332 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు 9 వికెట్లు కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. మూడవ రోజు ఆటలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (104) సెంచరీ చేశాడు. గిల్ తో పాటు అక్షర్ పటేల్ (45) మెరుగ్గా రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు. దీంతో.. ఇంగ్లండ్ ముందు భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు అయ్యింది.

కాగా ఆట ఇంకో 2 రోజులు మిగిలివుండగా ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. తొలి టెస్టులో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ మ్యాచ్ గెలుపొందాలంటే భారత బౌలర్లు విజృంభించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ ఉండాలి. మరి, ఈసారి భారత జట్టు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

ఈరోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను ఔట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్ 6, అశ్విన్ 29, కుల్దీప్, బుమ్రా డకౌట్ గా పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4 వికెట్లతో చెలరేగగా..రెహన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, బషీర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది

Updated : 4 Feb 2024 6:16 PM IST
Tags:    
Next Story
Share it
Top