Home > క్రీడలు > Akash Deep: తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. 3 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్

Akash Deep: తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. 3 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్

Akash Deep: తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. 3 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్
X

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెంగాల్ యువ పేసర్ ఆకాశ్ దీప్.. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో పరుగులు చేయనీయకుండా ఇంగ్లండ్ జట్టును కట్టడి చేస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే 12 ఓవర్లకు 3 వికెట్లు తీసి వాహ్వా అనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ లను పెవిలియన్ కు పంపించాడు ఆకాష్. వీరిద్దరితో పాటు మరో ఆటగాడు ఓలీ పోస్ ను సైతం డకౌట్ చేసి.. సిరీస్ సమం చేయాలన్న ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. భారీ స్కోర్ చేద్దామని గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన బ్యాటర్లకు తన బౌలింగ్ తో గట్టి సమాధానమిస్తున్నాడు.

కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ఆకాశ్‌ దీప్‌.. 4వ ఓవర్‌లోనే దీప్‌ అద్భుతమైన బంతితో జాక్‌ క్రాలేను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కానీ అది కాస్త నోబాల్‌ అవడంతో క్రాలే బతికిపోయాడు. కానీ ఆ తర్వాత 11.5 వద్ద అతడు వేసిన మరో బంతికి మరోసారి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు 9.2 ఓవర్‌లో బెన్‌ డకెట్‌ (11) ను ఔట్ చేశాడు. ఆ వెంటనే 9.4 వద్ద బెన్ స్థానంలో వచ్చిన ఒలీపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంట వెంటనే ముగ్గురినీ పెవిలియన్ కు చేర్చాడు ఆకాశ్ . తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్‌ దీప్‌ వేసే బంతులకు ఇంగ్లాండ్‌ బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఆకాశ్‌ దీప్‌ ఆదరగొడుతున్నాడు.

ఇంగ్లాండ్ తో చివరి 3 టెస్టులకు ఆకాష్ దీప్ భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ ఖాన్ స్థానంలో ఆకాష్ దీప్ కు చోటు దక్కింది. దీంతో తొలిసారి భారత టెస్టు స్క్వాడ్ లో ఈ బెంగాల్ పేసర్ కు అవకాశం దక్కించుకున్నాడు. ఈ 27 ఏళ్ళ పేసర్ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మూడు అనధికారిక టెస్టులలో ఇండియా ఎ జట్టు తరపున తన ప్రదర్శనతో జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకొని ఈ సిరీస్‌లో భారత A జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండు సార్లు నాలుగు వికెట్లను సాధించాడు.

Updated : 23 Feb 2024 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top