India vs England: ఆకాశ్‌కు మూడు.. వాళ్లిద్దరికి చెరొకటి.. మొత్తం 5 వికెట్లు
X
రాంచీ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య JSCA స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆది నుంచే కష్టాల్లో కూరుకపోయింది. . తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. తొలి రోజు లంచ్ వరకు ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి, కేవలం 112 పరుగులు చేసిందది. జో రూట్ 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా చేతిలో బెన్ స్టోక్స్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో తొలి సెషన్ ముగిసింది.
That's Lunch on Day 1 of the Ranchi Test!
— BCCI (@BCCI) February 23, 2024
A solid bowling display from #TeamIndia in the First Session! 👌 👌
Stay Tuned for Second Session! ⌛️
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/41kyCrSSvU
భారత్ నుంచి అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీశాడు. అతను జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్‌లను పెవిలియన్‌కు పంపాడు. జానీ బెయిర్‌స్టోను రవిచంద్రన్ అశ్విన్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. బెయిర్‌స్టో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో అశ్విన్ వేసిన రెండో బంతికి బెయిర్ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ (23 మ్యాచ్‌ల్లో)ను అందుకున్నాడు. అంతేకాదు.. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా ఇతడే. జేమ్స్ అండర్సన్ టీమ్‌ఇండియాపై టెస్టుల్లో 139 వికెట్లు (35 మ్యాచ్‌ల్లో) తీసి ముందంజలో ఉన్నాడు.