Home > క్రీడలు > INDvsENG : భారత్ - ఇంగ్లాండ్ పోరుకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం.. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం

INDvsENG : భారత్ - ఇంగ్లాండ్ పోరుకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం.. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం

INDvsENG : భారత్ - ఇంగ్లాండ్ పోరుకు సిద్ధమైన ఉప్పల్ స్టేడియం.. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
X

బజ్ బాల్ ఆటతో టెస్టుల్లో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ఒకవైపు.. సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడుతూ ముందుకు సాగుతున్న టీమిండియా మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ్టి నుంచి రసవత్తర పోరు జరగనుంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా.. ఇవాళ్టి నుంచి ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో వెనకబడి ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం.

కాగా స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్పై టీమిండియా గట్టి ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ముగ్గు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్లకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు కూడా తుది జట్టులో చోటు లభించే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో రాహుల్ కీపింగ్ చేయడని ద్రవిడ్ ఇప్పటికే చెప్పడంతో కీపర్ గా కేఎస్ భరత్ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక స్వదేశంలో టీమిండియాకు షాకివ్వాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

కాగా ఉప్పల్ పిచ్ టీమిండియాకు పెట్టని కోట.. ఇక్కడ ఆడిన ఏ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది లేదు. అందుకే రేపటి మ్యాచ్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. 2005లో ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే.. 2010లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ వేదికపై ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన భారత్.. నాలుగు మ్యాచుల్లో ఘన విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది.

టీమిండియా(అంచనా) : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Updated : 25 Jan 2024 4:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top